బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేంద్కర్ కు బీసీ సంక్షేమ సంఘం అధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పూలాంగ్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆలోచనలతోనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైందని, ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు వచ్చినప్పుడే అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయని అన్నారు. కార్యక్రమంలో...