Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 December 2024, 3:14 pm Posted by : ramakrishna

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేంద్కర్ కు బీసీ సంక్షేమ సంఘం అధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పూలాంగ్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆలోచనలతోనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైందని, ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు వచ్చినప్పుడే అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయని అన్నారు. కార్యక్రమంలో నరాల సుధాకర్, దర్శనం దేవేందర్, కరిపె రవీందర్, కొయ్యాడ శంకర్, శ్రీలత, వాసం జయ, బాలన్న తదితరులు పాల్గొన్నారు.