బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు నివాళ్ళు

  ఇందూర్, బతుకమ్మ : సాయుధ పోరాట యోధురాలు, బీసీల నిప్పు కణిక, ధీశాలి చాకలీ ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా వినాయక నగర్ లోని హనుమాన్ జంక్షన్ లో గల వీర నారి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద బిసి సంక్షేమ సంఘం నాయకులు గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. బీసీలు తిరగబడితే దేన్నైనా సాధించవచ్చని ఐలమ్మ చరిత్రే నిదర్శనమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ అన్నారు. ఇప్పటికైనా బీసీలు మేలుకొని తమను తాము పరిపాలించుకోవాలని, ఆ రోజు...