అయోధ్య వరకు పాదయాత్ర

రుద్రూర్, బతుకమ్మ : జుక్కల్ మండలం వజ్ర కంటి గ్రామానికి చెందిన భక్తులు అయోధ్య వరకు పాదయాత్ర  చేపట్టారు. భజనలు, కీర్తనలు, జై శ్రీరామ్.. జై శ్రీరామ్ నినాదాలతో పాదయాత్ర నిర్వహించారు.   ఈ పాదయాత్ర గురువారం రుద్రూర్ గ్రామానికి చేరుకుంది. గ్రామంలోని విట్టల్ గౌడ్ ఇంటి వద్ద పాదయాత్ర నిర్వహించిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పాదయాత్ర అయోధ్య వరకు కొనసాగుతుందని భక్తులు తెలిపారు.