Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 8:14 pm Posted by : ramakrishna

ప్రకృతి వనంలో చెట్లను తొలగిస్తున్నారు

 

. . . మా దృష్టికి రాలేదు : ఎంపీడీవో అనిత రెడ్డి

 

మహమ్మద్ నగర్, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ తహసీల్దార్ కార్యాలయం పక్కన పకృతి వనం ఏర్పాటు చేశారు. ఆ ప్రకృతి వనంలో మొక్కలు వృక్షాలుగా పెరిగి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తుంది. స్థలం లేకపోవడంతో పాఠశాల ఆవరణలో ఈ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. మొక్కలు పెరిగి వృక్షాలుగా మారిన తర్వాత తహసీల్దార్ కార్యాలయంలోకి విష పురుగులు వస్తున్నాయని, పెరిగిన చెట్లను జెసిబి ద్వారా తొలగిస్తున్నారు. ఎంతో ఖర్చు చేసి ప్రకృతి వనంలో మొక్కలు నాటి వృక్షాలుగా పెంచిన తర్వాత ఆ అధికారి ఆ మొక్కలను జెసిబి ద్వారా తొలగించడం పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏమైనా అంటే తమ కార్యాలయం లోకి విషపురుగులు వస్తున్నాయని పెరిగిన చెట్లను తొలగిస్తున్నారు. ఈ విషయంపై ఏపీవో శివకుమార్ దృష్టికి తీసుకెళ్లగా తన దృష్టికి రాలేదని, తాము ప్రకృతి వనాలు, అవెన్యూ ప్లాంటేషన్ గ్రామపంచాయతీలకే అప్పగించామని వారే వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవా ల్సి ఉంటుందని తెలిపారు. ఎంపీడీవో ఈ విషయాన్ని గ్రామ కార్యదర్శి జ్యోతి దృష్టికి తీసుకువెళ్లగా తహసీల్దార్ లతా, ప్రకృతి వనాల్లో ఉన్న మొక్కలను తమకు సమాచారం ఇవ్వకుండా తొలగిస్తున్నారని ఆమె వెల్లడించారు. పిచ్చి మొక్కలు కాదు ఏకంగా ప్రకృతి వనంలో ఉన్న చెట్లను జెసిబి ద్వారా తొలగిస్తున్న మాట వాస్తవమని ఆమె అంగీకరించారు. విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని పంచాయతీ కార్యదర్శి జ్యోతి వెల్లడించారు. తమకు సమాచారం ఇవ్వకుండా ప్రకృతి వనంలో గాని, అవెన్యూ ప్లాంటేషన్ లో పెంచిన చెట్లను నరికితే అది చట్టరీత్యా నేరమని ఆమె వెల్లడించారు. ఓ తహసీల్దార్ ఉండి తమ కార్యాలయం వద్ద పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న మొక్కలను జెసిబి ద్వారా తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రజల నుంచి ప్రశ్నలు వెల్లబడుతున్నాయి. తహసీల్దార్ కు మొక్కలు నరికే అధికారం ఎవరిచ్చారు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మొక్కలు తొలగించడంపై అధికారులపై కలెక్టర్ చర్య తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే…