రోటరీ ఆధ్వర్యంలో ట్రీ ప్లాంటేషన్

కామారెడ్డి, బతుకమ్మ : రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కామారెడ్డి లోని స్థానిక మార్కండేయ మందిరం ప్రాంగణంలో రోటరీ గవర్నర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ దృశ్ట్యా, వర్షాకాలం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి మెంబర్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అందరి సమన్వయంతో మార్కండేయ మందిరంతో పాటు మూడు చోట్ల రాగి, వేప, మేడి, జువ్వి, మర్రి లాంటి మొక్కలు సుమారు వంద నాటామని తెలియజేశారు. వీటిని జాగ్రత్తగా చూసుకుంటూ చక్కటి వృక్షాలుగా...