లింగంపేట్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా లింగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధి లోని ముస్తాపూర్–కామారెడ్డి రాష్ట్ర రహదారి-11 రోడ్‌పై ఆదివారం రాత్రి వర్షం కారణంగా పెద్ద చెట్టు నేలకూలింది. లింగంపేట్ ఎస్ ఐ -2 సుబ్రహ్మణ్యం చారి, సిబ్బంది సత్వరమే స్పందించి జేసీబీతో చెట్టును తొలగింపజేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకముందే స్పందించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.
