కార్మికుల మృతదేహాలను అట్టపెట్టల్లో తరలించడం దారుణం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, బతుకమ్మ : సిగాచీ ఫ్యాక్టరీ పేలుడులో చనిపోయిన వారి పట్ల రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అమానవీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కార్మికుల మృతదేహాలను అట్టపెట్టల్లో తరలించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరాయి రాష్ట్రం నుంచి తెలంగాణకు ఉపాది కోసం వచ్చి చనిపోయిన కార్మికుల మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వలేరా? అని ప్రశ్నించారు. భయంకర పేలుడు జరిగి యాభై మందికి పైగా చనిపోతే రేవంత్ రెడ్డి మాత్రం సంఘటన స్థలానికి వెళ్లి...