సిరిసిల్ల నుంచి సర్ధాపూర్ గోదాంలోకి ఈవీఎంల తరలింపు
. . . ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిరిసిల్లా, బతుకమ్మ : 2018 వేములవాడ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కోర్టు కేసు కారణంగా ఇంతకాలం సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేకంగా భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంల)ను గురువారం సర్ధాపూర్‌లోని ఈవీఎం గోదాంలోకి తరలించారు. కోర్టు కేసు ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతులు వచ్చిన అనంతరం, ఎన్నికల నిబంధనలు, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఈవీఎంల తరలింపు ప్రక్రియను చేపట్టారు. జిల్లా కలెక్టర్...