
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డిలో రూ.4.25 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన బస్ స్టాండ్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్ మోహన్ రావుతో కలిసి ప్రారంభించారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలో రాష్ట్ర మంత్రికి కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. బస్ స్టాండ్ వద్ధ జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి ప్రజలకు అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తదితరులు పాల్గొన్నారు.
