
. . . కలెక్టరేట్ ఎదుట హిజ్రా ల ధర్నా
. . . చర్యలకు ప్రజావాణిలో ఫిర్యాదు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్ జెండర్లు గ్రామాలలోకి రావద్దని బహిరంగ పోస్టర్, ప్లెక్సీలు ఏర్పాటు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్న గ్రామాభివృద్ధి కమిటీ లపై చర్యలు తీసుకోవాలని ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట హిజ్రాలు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు ఓరుగంటి గంగా, జరీనా బేగం మాట్లాడుతూ… సిరికొండ మండలం మైలారం గ్రామంలో చిన్నపిల్లలను అపహరిస్తున్నారని భౌతిక దాడులు చేశారని ఆరోపించారు, నందిపేట్ మండలం ఒ గ్రామంలో జి పి లో నిర్బంధించారని అన్నారు. అదే విధంగా మోపాల్ మండలం సిర్ పూర్, భీంగల్ మండలం బడా భీంగల్ లో హిజ్రాలు గ్రామాలకు రావద్దు అని విడిసి పేరుతో ప్లెక్సీలు ఏర్పాటు చేసి సామాజిక బహిష్కరణకు గురి చేస్తున్నారు అన్నారు. శుభకార్యాలకు వెళ్లి ఆశీర్వదించడం వారిచ్చినది తీసుకోవడం, భిక్షాటన చేస్తున్న జీవిస్తున్న వారిపై జరుగుతున్న దుష్ప్రచారం చేస్తున్న విడిసీలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ట్రాన్స్ జెండర్ ల పై అక్రమ నిర్భందం, భౌతిక దాడులు, బహిష్కరణకు గురి చేస్తు మానవ హక్కులను కాలరాస్తున్న గ్రామాభివృద్ధి కమిటీ పై చర్యలు తీసుకుని సామాజిక భద్రత కల్పించాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.