Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 November 2025, 5:38 pm Posted by : ramakrishna

కోపర్గా గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలు

బతుకమ్మ, బోధన్ : బోధన్ మండలం కోపర్గా  గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలు చోటుచేసుకోవడంతో గ్రామ రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల గ్రామంలోని పలు ప్రాంతాల్లో ట్రాన్స్‌ ఫార్మర్లు దొంగిలించబడిన ఘటనలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన జి. చిన్న సాయిలు మాట్లాడుతూ ప్రతి రైతు తమ వ్యవసాయంలో ఉన్న ట్రాన్స్‌ ఫార్మర్లను ప్రత్యేకంగా కాపాడుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినప్పుడు వెంటనే గ్రామ పెద్దలతో పాటు సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

Transformer thefts in Koparga village

Transformer thefts in Koparga village