Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 January 2026, 4:49 pm Posted by : ramakrishna

కల్దుర్కిలో ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం

 

.. కాపర్ వైర్ ఆయిల్ చోరీ

బోధన్, బతుకమ్మ

బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి దుండగులు రెచ్చిపోయారు. వ్యవసాయ క్షేత్రాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి, అందులోని కాపర్ వైర్లు ఆయిల్‌ను ఎత్తుకెళ్లినట్లు కౌలు రైతు రాము తెలిపారు.గురువారం ఉదయం పొలానికి వెళ్లిన రైతులు ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసమైన విషయం గమనించి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఈ ఘటనపై ట్రాన్స్‌కో ఏఈకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సాగునీరు అందించాల్సిన కీలక సమయంలో ఇలాంటి విద్యుత్ పరికరాల చోరీలు జరగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుండగుల పై కఠిన చర్యలు తీసుకుని, త్వరితగతిన విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.