నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ ఆపరేషన్ సర్కిర్ లో సబ్ ఇంజనీర్లుగా, ఏఈ లుగా పని చేస్తున్న పలువురిని బదిలీ చేస్తూ టీజీఎన్ పీడీసీఎస్ పీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఇద్దరు సబ్ ఇంజనీర్ లకు, ముగ్గురు ఏఈ లకు స్థాన చలనం కలిగిస్తు ఆదేశాలు వెలువడ్డాయి. మాక్లూర్ మండలం గొట్టుముక్కల లో సబ్ ఇంజనీర్ గా పని చేస్తున్న పీర్ సింగ్ ను కామారెడ్డి జిల్లా జుక్కల్ ఏఈ గా బదిలీ చేశారు. పెర్కిట్ లో పని చేస్తూ సెలవులో ఉన్న మోనికా రెడ్డి ని ఆర్మూర్ టెక్నికల్ ఏఈ గా బదిలీ చేశారు. ఆర్మూర్ లో ఏఈ గా పని చేస్తున్న లక్ష్మణ్ ను నిజామాబాద్ ఎస్ పిఎం గా బదిలీ చేశారు. బషీరాబాద్ లో పని చేస్తున్న కరీంనగర్ జిల్లాకు ట్రాన్స్ ఫన్ చేశారు. ఆయన స్థానంలో ఎవరిని నియమించలేదు. నిజామాబాద్ ఆపరేషన్ సర్కిల్ లో సబ్ ఇంజనీర్ గా పని చేస్తున్న సేన సంజయ్ ని కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ఏఈ గా ట్రాన్స్ ఫర్ చేశారు.