Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 November 2024, 12:07 pm Posted by : ramakrishna

మల్టీ జోన్ వన్ లో సీఐ ల బదిలీలు

నిజామాబాద్, బతుకమ్మ: మల్టీ జోన్-1 పరిధిలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ ఆదివారం  ఉత్తర్వులు జారీ అయ్యాయి. కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సీఐలకు స్థాన చలనం కలిగింది.  వెయిటింగ్ లో ఉన్న సతీశ్ కుమార్ ను ఖాళీగా ఉన్న నిజామాబాద్ సీసీఆర్బీకి, ట్రాఫిక్ ఎస్ హెచ్ వో ఎస్ వీరయ్యను పీసీఆర్ కు బదిలీ చేశారు. జగిత్యాల సీసీఎస్ లో ఉన్న లక్ష్మీనారాయణను మానకొండూర్ కు, మానకొండూర్ ఎస్ హెచ్ వో సాధన్ కుమార్ ను రాజన్న సిరిసిల్ల సీసీఎస్ కు, వెయిటింగ్ లో ఉన్న అల్లం రాంబాబును నిర్మల్ డీఎస్ బీకి, మున్నూరు క్రిష్ణను నిర్మల్ సీసీఎస్ కు, నరహరి నిర్మల్ డీసీఆర్ బీకి బదిలీ అయ్యారు.