Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 August 2025, 7:45 pm Posted by : ramakrishna

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో దశాబ్దాల తరువాత బదిలీలు

  • సిసిలను, ఎంఎస్ సీసీలకు స్థాన చలనం
  • హర్షం వ్యక్తం చేస్తున్న ఐకేపి ఉద్యోగులు

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో దశాబ్దకాలంగా బదిలీలు లేకుండా ఉన్న జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో బదిలీలు జరిగాయి. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఐకేపి అధికారులు గత వారం రోజులుగా సినియార్టి, రోస్టర్  ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని  తయారు చేసిన బదిలీ జాబితాను కౌన్సిలింగ్ ద్వారా స్థాన చలనం కలిగించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఐడిఓసీలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (ఐకేపీ) లో లెవల్ 1, లేవల్ 2 లుగా పనిచేస్తున్న కమ్యూనిటి కో ఆర్డినేటర్ లు, మండల సమాఖ్య కమ్యూనిటీ కోఅర్డినేటర్ల కు సాధరణ బదిలీలు చేశారు. 145 క్లస్టర్ ల పరిధిలో పనిచేస్తున్న వారిని వారి వారి మండలం పరిధిలో 10 సంవత్సరాల తరువాత బదిలీ చేయడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జరిగిన బదిలీ కార్యాక్రమంను డిఆర్ డిఓ సాయగౌడ్, అడిషనల్ డిఆర్ డిఓ మధు సుధన్, హెచ్ఆర్ ఎపియం అనిల్ కుమార్, మండల సమాఖ్యల సిసీలు, ఎంఎస్ సిసీలు పాల్గొని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.

Transfers after decades in District Rural Development Organization