Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 December 2024, 3:52 pm Posted by : ramakrishna

కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఎస్సైల బదిలీ

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఇన్ చార్జి డీఐజీ చంద్రశేఖర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాసర జోన్-2 పరిధిలో మొత్తం 24 మంది ఎస్సైలను బదిలీ చేశారు. కమిషనరేట్ పరిధిలోని నందిపేట ఎస్ హెచ్ వో హరిబాబాను వీఆర్ కు బదిలీ చేశారు. ఆర్మూర్ ఎస్సై -1 గోవింద్ ను  సైతం వీఆర్ కు బదిలీ చేసినప్పటికీ ఆర్మూర్ పీఎస్ కు అటాచ్ చేశారు. వేల్పూర్ ఎస్సై నాగనాథ్ ను ఆదిలాబాద్ వీఆర్ కు బదిలీ చేశారు. అలాగే ఆదిలాబాద్ వీఆర్ లో ఉన్న సిలివేరి మహేశ్ కు  ఆర్మూర్ ఎస్సై-1 గా పోస్టింగ్ ఇవ్వగా, నందిపేట్, వేల్పూర్ ఎస్ హెచ్ వోలుగా ఎవరినీ నియమించలేదు.