Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 December 2024, 8:05 pm Posted by : ramakrishna

రాష్ట్రంలో పదిమంది ఐపీఎస్ ల బదిలీ

  • కామారెడ్డి ఏఏస్పిగా చైతన్య రెడ్డి

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో  పని చేస్తున్న పదిమంది ఐపిఎస్ లను ట్రాన్స్ ఫర్ చేస్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021,2022 ఐపిఎస్ క్యాడర్ కు చెందిన తొమ్మిది మందికి అదనపు ఎస్పీలుగా, ఒక్కరిని డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి అదనపు ఎస్పీగా బి.చైతన్య రెడ్డిని నియమించారు. గ్రే హౌండ్స్ లో ఏఏస్ పిగా ఉన్న చైతన్య రెడ్డిని కామారెడ్డికి బదిలీ చేశారు.  2022 ఐపిఎస్ క్యాడర్ కు చెందిన బి.చైతన్య రెడ్డి నిజామాబాద్ జిల్లాలో ప్రోహిబిషనరి శిక్షణ  తీసుకున్నారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ఓ(ఇంచార్జీ) గా పని చేశారు.