Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2024, 5:28 pm Posted by : ramakrishna

పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరుగురు కానిస్టేబుళ్లు బదిలీ

నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ : నిజామాబాదు పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు కానిస్టేబుళ్లను బదిలీ చేస్తున్నట్లు సిపి కల్మేశ్వర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ముగ్గురు బదిలీ కాగా, సిరికొండ, ధర్పల్లి, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ల నుండి ఒక్కొక్కరి చొప్పున బదిలీ అయ్యారు. వీరిని అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో భాగంగా బదిలీలు చేయడం జరిగిందని సిపి ఉత్తర్వులో ప్రకటించారు.

Transfer of six constables under Police Commissionerate