- కొత్త వారు ఏడుగురికి పోస్టింగ్
- ఏడుగురు వీఆర్ కు బదిలీ
- జిల్లాలో తొలిసారి ఎస్ హెచ్ఓ లుగా మహిళా ఎస్ఐలకు అవకాశం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (బాసర జోన్ 2) పరధిలో పనిచేస్తున్న ఎస్ఐ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 14 మందిని బదిలీ చేయగా అందులో 7 గురు కొత్త ఎస్ఐలకు పోస్టింగ్ లు ఇవ్వగా, 7 గురిని వీఆర్ కు పంపుతున్న ఉత్తర్వులు వెలువడ్డాయి. నిజామాబాద్ వీఆర్ లో ఉన్న కొత్త ఎస్ఐలలో సిరికొండ ఎస్ హెచ్ ఓ గా మామిడిపల్లి కళ్యాణిని నియమించగా, మోపాల్ ఎస్ హెచ్ ఓగా సి హెచ్ సుమలతను, మెండోరా ఎస్ హెచ్ ఓగా జాదవ్ సుహసిని నియమించారు. వీఆర్ లో ఉన్న పడాలా రాజేశ్వర్ ను ఏర్గట్లకు, కలమడుగు కిరణ్ పాల్ లను మూడవ టౌన్ రెండవ ఎస్ఐగా నియమించారు. సిరికొండ ఎస్ హెచ్ ఓ రామును, మోపాల్ ఎస్ హెచ్ ఓ యాదగిరి, ఎడపల్లి ఎస్ హెచ్ ఓ వంశీ క్రిష్ణ, మోండోరా ఎస్ హెచ్ ఓ యాసర్ ఆరాఫత్ ను, ఎర్గట్ల ఎస్ హెచ్ ఓ బి.రాములను నిజామాబాద్ వీఆర్ కు బదిలీ చేయగా, బాల్కొండ ఎస్ హెచ్ఓ నరేష్, మోర్తాడ్ ఎస్ హెచ్ ఓ విక్రం లను ఆదిలాబాద్ వీఆర్ లకు అటాచ్ చేశారు.