నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా కోర్టు సముదాయంలో జూనియర్ సివిల్ జడ్జిలుగా విధులు నిర్వహిస్తున్న ఖుష్భూ ఉపాధ్యాయ, కుమారం గోపికృష్ణ లను హైదరాబాద్ కు బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వారు గత మూడు సంవత్సరాలుగా విధులలో ఉన్నారు. సాదారణ బదిలీలలో భాగంగానే వీరి బదిలీ జరిగింది. రాష్ట్రంలో వివిధ జిల్లాలో మొత్తం 49 మంది జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ, నియామాకాలు జరిగాయి. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (విజిలెన్స్ ) హైకోర్టు తరపున ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ న్యాయవాదులు జక్కుల వెంకటేశ్వర్, ఆర్ ఎస్ ఎల్ గౌడ్, నరేందర్ రెడ్డి, కిషన్ రావు దేశముఖ్, సంతోష్ నిర్మల్కర్, శ్యామ్ బాబు, వేణు తదితరులు బదిలీ ఉత్తర్వులు అందుకున్న జడ్జి గోపికృష్ణ ను ఆయన చాంబర్లో కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జడ్జిలు ఖుష్భూ, గోపికృష్ణ ఇద్దరు భార్యభర్తలిద్దరిని హైదరాబాద్ కు బదిలీ చేయడం ముదావాహమని వారు అన్నారు. ఎక్కడ ఉన్న నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులను మరువరాదనీ పేర్కొన్నారు.
