Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 6:53 pm Posted by : ramakrishna

బోధన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ ల బదిలీ

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

ఉమ్మడి జిల్లాలో సబ్ కలెక్టర్ లు గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వికాస్ మహాతో, కిరణ్మయి లను బదిలీ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం 28 ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానిలో భాగంగా బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ని ఎల్ బి నగర్ కమిషనర్ గా నియమించారు. అలాగే బాన్సువాడ సబ్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న కిరణ్మయి ని రంగారెడ్డి జిల్లాకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బదిలీ చేశారు.

 

Transfer of Bodhan and Banswada Sub-Collectors

 

పరిపాలనా సమర్థతను పెంపొందించేందుకు, సేవల పంపిణీని మరింత మెరుగుపరిచేందుకు ఈ బదిలీలు చేపట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. కొత్త బాధ్యతల్లో ఈ అధికారులు తమ అనుభవంతో సమర్థవంతంగా పని చేస్తారని ప్రభుత్వం ఆశా భావం వ్యక్తం చేస్తుంది. బోధన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ లుగా ఇంత వరకు ఎవరిని నియమించలేదు.