Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 2:21 pm Posted by : ramakrishna

15 మంది సర్కిల్ ఇన్స్ పెక్టర్ ల బదిలీ

హైదరాబాద్, బతుకమ్మ:

 పోలీస్ శాఖలో మల్టీ జోన్ 1 పరిధిలో 15 మంది సీఐల బదిలీ చేస్తూ ఐజి ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన పరమైన అవసరాల రీత్యా 15 మంది ఇన్స్ పెక్టర్ లకు స్థానచలనం కలిగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. బదిలీ అయిన వారు ఉన్న పళంగా విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇద్దరు సీఐలకు ట్రాన్స్ ఫర్ అయింది. కామారెడ్డి పిసిఆర్ లో ఉన్న జగడం నరేష్ ను బిక్కనూర్ సీఐ గా నియమించారు. నిజామాబాద్ సిసిఎస్ లో పనిచేస్తున్న పింగ్లీ మహేందర్ రెడ్డి ని సిద్ధిపేట్ 1 టౌన్ ఎస్ హెచ్ ఓ గా నియమించారు.

Transfer of 15 Circle Inspectors
Transfer of 15 Circle Inspectors