Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 3:09 pm Posted by : ramakrishna

సిజిఎల్ లో ట్రాన్స్ కో సీఐ కుమారుడికి ఆలిండియా 102 ర్యాంక్

 నిజామాబాద్, బతుకమ్మ:

 నిజామాబాద్ ట్రాన్స్ కో విజిలెన్స్ సీఐ జక్కుల శంకర్ రావు పెద్ద కుమారుడు ప్రణయ్ స్టాప్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన సిజిఎల్ లో ఆలిండియా 102 వ ర్యాంక్ సాధించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లలీతపురం గ్రామానికి చెందిన జక్కుల శంకర్ రావు గత కొంత కాలంగా ట్రాన్స్ కో విజిలెన్స్ విభాగం లో పనిచేస్తున్నారు. ప్రణయ్ గతంలో పోస్టల్, బ్యాంకింగ్ తో పాటు మొత్తం ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇటివల స్టాప్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన సిజిఎల్ లో ఆలిండియా 102 వ ర్యాంక్ సాధించడంతో ఈ ర్యాంక్ ద్వార కస్టమ్స్ ఇన్స్ పెక్టర్ గా ఎన్నిక కానున్నారు. జాతీయ స్థాయిలో ఆలిండియా ర్యాంక్ సాధించిన ప్రణయ్ ను స్థానికులు అభినంధించారు.

Transco CI's son secures 102nd rank in CGL
Transco CI’s son secures 102nd rank in CGL