. . . పేరుకే చెక్ పోస్ట్
. . . తనిఖీలు ఓకవైపు… రవాణా మరోవైపు
. . . ఓక్కో వేహికిల్ కు రేటు సపరేటు
. . . తమ పరిధి కాదంటూనే అక్రమార్కులకు అండగా ఖాకీలు
కోటగిరి, బతుకమ్మ :
కోటగిరి పోలీస్ ల తీరు రోజురోజుకు వివాదాస్పదంగా మారుతుంది. ప్రజల కోసం పని చేయాల్సిన పోలీసులు అక్రమార్కుల గుప్పెట్లో కీలుబొమ్మలుగా మారారనే పుకార్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. మంజీర పరిహారక ప్రాంతాల నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న అక్రమార్కులకు పోలీసు శాఖలో కొందరు అధికారులు అక్రమ ఇసుక రవాణాకు అండగా నిలిచి ఇబ్బంది లేకుండా ముందస్తు సమాచారం ఇస్తూ తప్పించే ప్రయత్నం చేస్తున్నారని గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అందుకు నిదర్శనంగా పోలీస్ స్టేషన్ ముందు నుంచి అక్రమ ఇసుక రవాణా తరలిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టుకోవాల్సిన పోలీసులే సదరు ట్రాక్టర్లను యజమానితో కుమ్మక్కై వదిలేయడంపై పోలీసుల అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని విషయం బహిర్గతమైంది. తమ పరిధి కాదంటూనే ఇసుక మాఫియాను తమ గుప్పెట్లో పెట్టుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మంజీర పరివాహక ప్రాంతాలైన కొడిచర్ల, కారేగాం, హంగార్గ గ్రామాల నుండి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారనే విషయం పోలీసులకు తెలిసినప్పటికీ ఒక గ్రామం నుండి రవాణా జరుగుతే మరొక గ్రామంలో పెట్రోలింగ్ చేస్తూ ఇసుక మాఫియాదారులకు సహకరిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రయిందంటే ఇసుక ట్రాక్టర్ లు, టిప్పర్ లు చెక్ పోస్టు మీదుగా సరిహద్ధులు దాటుతున్నాయి. టిప్పర్ కు ఓక రేటు ,ట్రాక్టర్ ఇంత అని వసూల్ చేస్తూ గట్టిగానే దండుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బోధన్ డివిజన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేసిన ఫలితం శూన్యంగానే మిగిలింది. రాత్రి సమయాలలో పోతంగల్ నుండి అక్రమంగా డంపు చేసిన ఇసుకను టిప్పర్లు, డంపర్ల, ద్వారా ఇసుక అక్రమంగా రెవెన్యూ,పోలీసు శాఖ అధికారుల ముందు నుండి తరలిస్తున్న పట్టుకోవాల్సిన వారే పచ్చజెండా ఊపుతున్నారు అనే విమర్శలు ఉన్నాయి. ఇసుక ఆక్రమ రవాణా విషయం అధికారుల స్థాయిని బట్టి ఎవ్వరికి ఎప్పుడు మామూళ్లు అందాలో అందడం వలననే ఆక్రమ రవాణను చూసి చూడనట్లు ఉన్నారనే వాదానలు లేకపోలేదు.
