ఫోన్ కాల్ తో రైతులను ఆదుకున్న ట్రాన్స్ కో ఎస్ఈ
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఆరుగాలం కష్టపడి పంట పండించుకునే రైతులకు రబీలో ట్రాన్స్ఫార్మర్ పలు మార్లు కాలిపోయింది. దాని స్థాయి పెంచాలని అధికారులకు మొరపెట్టుకున్న స్పందించ లేదు. చివరికి మాజీ జెడ్పిటిసి సాయంతో ఎస్ఈకి ఫోన్ చేస్తే నాలుగు గంటల్లో100 కేవీ ట్రాన్స్ఫార్మర్ను అందించారు. ఈ సంఘటన శనివారం రామారెడ్డి మండలం మోసంపూర్ గ్రామం లో చోటు చేసుకుంది. దీంతో ఆ అధికారికి ఆ గ్రామ రైతులు కృతజ్ఞతలు తెలిపారు. తమకు మీరే దేవుడని తమ కళ్ళముందే తమ పంటలు ఎండిపోతున్నాయని ఏం చేయలేకపోతున్నామన్నారు....