. . . వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి. యాదగిరిరావు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
శిక్షణా కార్యక్రమాలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో, ఉద్యోగ అవకాశాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలంగాణ యూనివనర్సటీ ఉపకులపతి టి.యాదగిరి రావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ రిలయన్స్ ఫౌండేషన్, మ్యాజిక్ బస్ ఫౌండేషన్ సహకారంతో శుక్రవారం విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ హాజరై శిక్షణలో పాల్గొన్న 70 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్ లర్ మాట్లాడుతూ ఆధునిక ఉద్యోగ మార్కెట్‌లో పోటీ తీవ్రమైందని, విద్యార్థులు కేవలం అకడామిక్ పరంగా మాత్రమే కాకుండా కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు, సమూహంగా పనిచేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. రిలయన్స్ ఫౌండేషన్ మ్యాజిక్ బస్ ఫౌండేషన్‌కు చెందిన రిసోర్స్ పర్సన్స్ పవన్ రెడ్డి, అంజలి మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమంలో విద్యార్థులకు కెరీర్ ప్రణాళిక, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, సమయ నిర్వహణ, వ్యక్తిత్వ వికాసంపై ప్రాక్టికల్ శిక్షణ అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాంబాబు, ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ పాత నాగరాజు, డా.జి.శ్రీనివాస్, డా.సి.హెచ్.శ్రీనివాస్, డాక్టర్ కిరణ్ రాథోడ్, విద్యార్థులు పాల్గొన్నారు.
