Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 8:28 pm Posted by : ramakrishna

వైద్యాధికారులకు సర్వీస్ రూల్స్ పై శిక్షణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు సర్వీస్ రూల్స్ పై సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రిటైర్డ్ లేబర్ ఆఫీసర్ యోహన్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్వీస్ రూల్స్ పై నియమ నిబంధనలు, చట్టాలు, ఉద్యోగుల సర్వీసులో ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, డిస్ట్రిక్ట్ ఆఫీసు మ్యానువల్ పై, న్యాయపరమైన సలహాలు సూచనలు చట్టానికి లోబడి ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు, కండక్ట రూల్స్ కు లోబడి ఎటువంటి చర్యలు తీసుకోవాలి మొదలగు అనేక అంశాలపై శిక్షణను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో సుమంత్ కుమార్, జిల్లా ఉప వైద్యాధికారులు డా.రవీందర్ డా.సికందర్ నాయక్, డా.సమత, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పాల్గొన్నారు.