Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2025, 9:18 pm Posted by : ramakrishna

మానవ వనరుల అక్రమ రవాణ నివారణపై శిక్షణ

బతుకమ్మ, మాచారెడ్డి: మహిళలు పిల్లలు మోసపోకుండా జాగ్రత్త వహించాలని మాచారెడ్డి ఎస్ఐ అనిల్ సూచించారు. మండల సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మానవ వనరుల అక్రమ రవాణా నివారణ, సైబర్ నేరాలపై మహిళా సంఘాల నేతలకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలు చిన్నపిల్లలు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని,  అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, ఫోన్ ఉపయోగించడం లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో  ఏపీఎం శ్రీనివాస్, గ్రామ సంఘం అధ్యక్షురాళ్లు, వివో లు తదితరులు పాల్గొన్నారు.