Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 January 2025, 7:08 pm Posted by : ramakrishna

వైద్యాధికారులు, ఫార్మసిస్టులకు ఈ ఔషదిపై శిక్షణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పబ్లిక్ హెల్త్, వైద్య విధాన పరిషత్, మెడికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన వైద్యాధికారులు, ఫార్మసిస్టులు ,నర్సింగ్ ఆఫీసర్లకు మంగళవారం ఈ ఔషది పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ, డి సి హెచ్ ఎస్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ శిక్షణలో జిల్లాలోని పిహెచ్సిలు, యుపిఎస్సిలో, సిహెచ్ సి లలో,  జిజిహెచ్ లో మందుల పంపిణీ, మందుల సరఫరా, ఈ ఔషధీ నిర్వహణ గురించి అవగాహన కల్పించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరిం డెంట్, డిసిహెచ్ఎస్  ముగ్గురు సభ్యులతో కూడిన బృందం ఈ ఔషధీని తనిఖీ చేయడం, మందులను తిరిగి సరఫరా చేస్తారని తెలిపారు. ఎన్సిడి, ఎసెన్షియల్ డ్రగ్స్, ఫ్యామిలీ ప్లానింగ్ డ్రగ్స్ వాటి నిలువ, వాటి వినియోగము, ఇండెంట్ చేసే విధానము, మందుల యొక్క ప్రాముఖ్యత గురించి, పారదర్శకంగా జిల్లా స్థాయి నుంచి పీహెచ్సీకి ,పిహెచ్సి నుంచి గ్రామస్థాయి వరకు అక్కడి నుంచి పేషెంట్ కు మందులు  పంపిణీ చేసే విధానo గురించి వివరించారు.  అలాగే ఆసుపత్రిలో ఉన్న సమస్యలు తెలుసుకుని వాటికి తగిన సలహాలు సూచనలు చేశారు.  వైద్యాధికారి, ఫార్మసిస్ట్ మధ్యన సమన్వయంతో మందుల పంపిణీ, మందుల నిలువ లాంటివి చేయాలని చెప్పడం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదరం నరసింహ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు.  అదేవిధంగా రాష్ట్రస్థాయిలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ బృందం జిల్లాకి ఏ సమయంలోనైనా విచ్చేసిపిఎస్సి ,సిఎస్సి, యు పి ఎస్ సి, జి జి హెచ్ ,డిస్టిక్ హాస్పిటల్ విచ్చేసి ఆకస్మిక తనిఖీ చేయడం జరుగుతుందని అందుచేత ఫార్మసిస్టులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇక్కడ చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా పాటించాలని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో, డిఎం హెచ్ ఓ డాక్టర్ రాజశ్రీ , డి సి హెచ్ ఎస్ శ్రీనివాస్, జిజిహెచ్ సూపర్డెంట్ శ్రీనివాస్,  డాక్టర్ రమేష్, డాక్టర్ రాథోడ్, డాక్టర్ అంజనా, డిప్యూటీ డిఎంహెచ్వోలు, డాక్టర్ అశోక్ డి ఐ ఓ, డాక్టర్ రాజు, డాక్టర్ వినీత్ ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు ,స్టాఫ్ నర్సులు ,ఫార్మసిస్టులు పాల్గొన్నారు.