ఐజీడి ఆధ్వర్యంలో అంగన్వాడీలకు శిక్షణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ డెవలప్మెంట్ (ఐజీడి) ఆధ్వర్యంలో  మంగళవారం అంగన్‌వాడీ కార్యకర్తలకు మైక్రో న్యూట్రిషన్, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు గురించి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ అతిధి గా జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అంగన్వాడి కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాలలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలకోసం పనిచేస్తున్నారని తెలిపారు. వారికి ఈ సూక్ష్మ పోషకాలు, ఆరోగ్యకరమైన ఆహారం గురించి సమగ్రమైన అవగాహన...