శిక్షణ ఐఏఎస్ అధికారికే మళ్ళీ బాధ్యతలు
మాక్లూర్, బతుకమ్మ: మండల పరిషత్ బాధ్యతలను శిక్షణ ఐఏఎస్ అధికారికే మళ్ళీ అప్పగించారు. రెండు నెలలు విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో అక్టోబర్ ఒకటి నుంచి నవంబర్ 30 వరకు బాధ్యతలను నిర్వర్తించారు. శిక్షణ నిమిత్తం వచ్చిన అధికారి కావడంతో గడువు పూర్తి కాగానే వెళ్ళిపోతారని ఊహించారు. వీటన్నింటిని పటాపంచలు చేస్తూ వచ్చే నెల జనవరి 18 వరకు మండలాధికారిగా ఉండాలని శిక్షణ అధికారికి మళ్ళీ సూచిస్తూ ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ జారీ చేసారు.