Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 October 2024, 5:50 pm Posted by : ramakrishna

కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఐటిఐలో శిక్షణ

బతుకమ్మ: బిచ్కుంద :  కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఐటిఐ లో శిక్షణ ఇవ్వనున్నట్టు కార్మిక శాఖ అధికారి (అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ )మహమ్మద్ ఇబ్రహీం జుబేర్ ఒక ప్రకటనలో తెలిపారు బాన్సువాడ డివిజన్ పరిధిలోని భవన ఇతర నిర్మాణ రంగాలలో పనిచేస్తున్న వారి పిల్లలకు ఐటిఐ లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. టెన్త్ అర్హత ఉన్న పిల్లలు ఈ క్రింది కోర్సులకు అర్హులన్నారు.  మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్.,  ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్,  ఆర్టిసియన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్,  బేసిక్ డిజైనర్ అండ్ విర్టల్ వెల్ఫేర్ (మెకానికల్),  అడ్వాన్సుడ్ సి ఏన్ సి మ్యాచింగ్ టెక్నీషియన్,  మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్. గల కోర్సు ఆసక్తి కలిగిన విద్యార్థులు ప్రవేశం పొందుటకై ఎస్ ఎస్ సి మెమో, బోనఫైడ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, టిసి మరియు ఆధార్ కార్డు తీసుకొని బిచ్కుందలోని ఐటిఐ కళాశాలలో సాంప్రదించగలరని లేదా సెల్ నెంబర్ 970316 2561 కు కాల్ చేసి సంప్రదించాలని ఆయన సూచించారు