బతుకమ్మ,ఏర్గట్ల :మండలంలో ఐకెపి ఆధ్వర్యంలో శనివారం మండల సమైక్య కార్యాలయంలో గ్రామ సంఘాల అధ్యక్షురాలు కార్యదర్శి కోశాధికారులకు రాష్ట్ర సిఆర్ పిఎస్ శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం శ్యామ్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలను అధిక ప్రాముఖ్యత ఇస్తూ ప్రభుత్వం ద్వారా చేపడుతున్న పథకాలు అమ్మ ఆదర్శ పాఠశాలలు వడ్డీ లేని రుణాలు స్కూల్ పిల్లలకు యూనిఫాంస్, ఉచిత బస్సు, సౌకర్యం మహిళ క్యాంటీన్, పెట్రోల్ బంకులు, మొదలైనవి మహిళలకు మహిళల ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలు కాబట్టి మహిళలు వినియోగించుకొని పేదరికంలో నుండి బయటపడాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సిఆర్ పి లత, అంజలి, ఆర్థిక లావాదేవీలు గ్రామ సమావేశాల గురించి పుస్తక నిర్వహణ గురించి శిక్షణ ఇచ్చారు. రాబోయే కాలంలో ప్రతి ఒక్క మహిళా సంఘాల్లో ఉండాలని సంఘంలో లేని వారిని సంఘంలో చేర్పించాలని వృద్ధు ల సంఘాలు,వికలాంగులు యొక్క సంఘాలు తయారు చేయాలని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో సి సి సంతోష్, స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ సరస్వతి,అకౌంటెంట్ సుప్రియ,మండల సమైక్య అధ్యక్షురాలు లక్ష్మి, కార్యదర్శి సునీత, కోశాధికారి లత, గ్రామాసంఘాల నుండి అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, హాజరయ్యారు.