Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 November 2025, 5:33 pm Posted by : ramakrishna

ఐహెచ్ఐపి పోర్టల్ పై ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బందికి శిక్షణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ ఫేస్ టు నందుగల ఐఎంఏ హాలులో నిజాంబాద్ డివిజన్లోని ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బందికి ఫై హెచ్ ఐ పి పోర్టల్ పై శిక్షణ  కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి.రాజశ్రీ హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చే తీసుకురాబడిన ఐహెచ్ఐపి పోర్టల్  లో వివరాలు తప్పనిసరిగా నమోదు  చేయాలన్నారు. పి –ఫామ్, ఎల్ -ఫామ్ లో నమోదు  చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి ప్రైవేటు ఆసుపత్రిలో ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ ద్వారా సేవలు పొందే రోగుల వివరాలు ఆన్లైన్ లోని ఐహెచ్ఐపి పోర్టల్ లో ఏ విధంగా నమోదు చేయాలో తెలియజేశారు. శిక్షణ పొందిన వారు అందరూ ఇకనుండి తప్పకుండా ఫార్మసీ, ల్యాబ్ సేవలు ఐ హెచ్ ఐ పి పోర్టల్ లో నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ డాక్టర్ నాగరాజు, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ అశ్విని,  డి ఈ డాక్టర్ శ్రావ్య, సి ఈ ఏ పి ఒ డాక్టర్ శిఖర, నారాయణ, పోశెట్టి, శ్రీనివాస్ గౌడ్,వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బంది.

Training for private hospital staff on IHIP portal