Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 October 2025, 5:32 pm Posted by : ramakrishna

పారదర్శక ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ

బతుకమ్మ, బోధన్ :  బోధన్‌లో సోమవారం స్థానిక సంస్థలు, రానున్న సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులకు, ప్రీసైడింగ్ ఆఫీసర్లకు (పి.ఓ.) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ బోధన్ లయన్స్ క్లబ్‌లో జరిగింది. బోధన్, ఎడపల్లి, రెంజల్, సాలూర్ మండలాల పోలీసింగ్, ఎన్నికల నిర్వహణలో పాల్గొనే అధికారులకు ఎన్నికల విధానంపై పూర్తి అవగాహన కల్పించారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికత పాటించాలని అదనపు కలెక్టర్ అంకిత్ (లోకల్ బాడీస్)  బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో  సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో పొరపాట్లకు తావు లేకుండా సమర్థంగా పనిచేయాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజు, సంబంధిత శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Training for officials on conducting transparent elections