Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 7:30 pm Posted by : ramakrishna

పాలన పరమైన అంశాలపై వైద్యాధికారులకు శిక్షణ

 

. . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డా.బి.రాజశ్రీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని డ్రాయింగ్ అధికారులైన మెడికల్ ఆఫీసర్ లకు, డ్రాప్టింగ్, పాలన పరమైన అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ తెలియజేశారు. వైద్య అధికారులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాలనా పరమైన అంశాల్లో, డ్రాప్టింగ్, ప్రొసీడింగ్స్, లెటర్ రైటింగ్, లీవ్స్ రూల్స్, ఆఫీస్ సభార్డినేట్ రూల్స్, మెమో, షో కాజ్ నోటీసు ఇవ్వడం, ఆర్ టి ఐ కేసెస్, కోర్టు కేసెస్ డీల్ చేయడం మొదలగు అన్ని అంశాలపై రిటైర్డ్ జిల్లా కార్మిక అధికారి యోహాన్ శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యాధికారుల సందేహాలకు జవాబులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ అశోక్, జిల్లా ఉపా వైద్యాధికారులు డాక్టర్ రవీందర్, డాక్టర్ సమత, డాక్టర్ సికందర్, ఏవో సుమంత్ కుమార్, వివిధ పిహెచ్సి ల వైద్యాధికారులు పాల్గొన్నారు.

 

Training for medical officers on administrative matters