12,13న  ఆర్ఓలు, ఎఆర్ఓలకు శిక్షణ తరగతులు

జిల్లా పరిషత్, బతుకమ్మ:  స్థానిక సంస్థల ఎన్నికల నేపద్యంలో ఆర్ఓలకు, ఎఆర్ఓలకు నేడు, రేపు  శిక్షణ తరగతులు ఉంటాయని జిల్లా పరిషత్ సిఈఓ సాయాగౌడ్ తెలిపారు. జడ్పిలోని సమావేశపు మందిరంలో 12 వ తేదిన ఉదయం 10.30 గంటలకు నిజామాబాద్ డివిజన్ జడ్పిటిసి ఆర్ఓలు, ఎంపిటిసి ఆర్ఓలు, ఎఆర్ఓలకు తరగతులు ప్రారంభమవుతాయన్నారు. 13 న బోధన్ డివిజన్ వారికి రైతు వేదికలో ఉదయం 10 గంటలకు, ఆర్మూర్ డివిజన్ వారికి క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 10.30 గంటలకు శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు....