Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 February 2025, 9:52 pm Posted by : ramakrishna

12,13న  ఆర్ఓలు, ఎఆర్ఓలకు శిక్షణ తరగతులు

జిల్లా పరిషత్, బతుకమ్మ:  స్థానిక సంస్థల ఎన్నికల నేపద్యంలో ఆర్ఓలకు, ఎఆర్ఓలకు నేడు, రేపు  శిక్షణ తరగతులు ఉంటాయని జిల్లా పరిషత్ సిఈఓ సాయాగౌడ్ తెలిపారు. జడ్పిలోని సమావేశపు మందిరంలో 12 వ తేదిన ఉదయం 10.30 గంటలకు నిజామాబాద్ డివిజన్ జడ్పిటిసి ఆర్ఓలు, ఎంపిటిసి ఆర్ఓలు, ఎఆర్ఓలకు తరగతులు ప్రారంభమవుతాయన్నారు. 13 న బోధన్ డివిజన్ వారికి రైతు వేదికలో ఉదయం 10 గంటలకు, ఆర్మూర్ డివిజన్ వారికి క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 10.30 గంటలకు శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. ఆర్ఓలు, ఎఆర్ఓలు శిక్షణకు హాజరయ్యేలా చూడాలని ఆయా మండలాదికారులకు సిఈఓ సూచించారు. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 100 మంది నామినేషన్ వేయగా 32 మంది నామినేషన్లు వివిధ కారణాల చేత ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. సరైన ఫార్మాట్ లో ఉన్న 68 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి. ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 17 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఒకరి నామినేషన్ తిరస్కరణకు గురైంది. 16 మంది నామినేషన్లు ఆమోదించారు. మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 3 నుండి 10 వరకు నామినేషన్లు స్వీకరించారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నామినేషన్ వేసిన వారి సమక్షంలో నిర్వహించారు.