కోటగల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ట్రైనీ కలెక్టర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ ట్రైనీ కలెక్టర్ జిపిఎస్ కోటగల్లి శంకర్ భవన్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల స్థాయిని మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ప్రతి తరగతికి వెళ్లి విద్యార్థులకు గణిత, ఇంగ్లీష్, ఈవీఎస్ సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులచే బ్లాక్ బోర్డ్ పై గణిత సమస్యలు ఇచ్చి అవి సాధించే విధంగా వారితోనే చేయించారు. ఇంగ్లీష్ పాఠాలను చదివించారు. చదువులో విద్యార్థులు బాగున్నారని ప్రశంసించారు. దీంతోపాటు పాఠశాలలో ఉన్న టాయిలెట్స్, కిచెన్, షెడ్డును పరిశీలించారు. విద్యార్థులకు అనుగుణంగా...