నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ ట్రైనీ కలెక్టర్ జిపిఎస్ కోటగల్లి శంకర్ భవన్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల స్థాయిని మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ప్రతి తరగతికి వెళ్లి విద్యార్థులకు గణిత, ఇంగ్లీష్, ఈవీఎస్ సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులచే బ్లాక్ బోర్డ్ పై గణిత సమస్యలు ఇచ్చి అవి సాధించే విధంగా వారితోనే చేయించారు. ఇంగ్లీష్ పాఠాలను చదివించారు. చదువులో విద్యార్థులు బాగున్నారని ప్రశంసించారు. దీంతోపాటు పాఠశాలలో ఉన్న టాయిలెట్స్, కిచెన్, షెడ్డును పరిశీలించారు. విద్యార్థులకు అనుగుణంగా టాయిలెట్స్, తరగతి గదులు లేవని ఉన్న తరగతి గదులు వర్షానికి లీకేజీ అవుతున్నాయని, విద్యార్థుల కూర్చోవడానికి బెంచీలు లేవని ప్రధానోపాధ్యాయులు రామచందర్ గైక్వాడ్ ట్రైనింగ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పాఠశాలలో ఉన్న సమస్యలను ట్రైన్ కలెక్టర్ నమోదు చేసుకున్నారు. అంతకుముందు ఇదే ప్రాంగణంలో ఉన్న శంకర్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం కిచెన్ గార్డెన్ పరిశీలించారు. ట్రైనీ కలెక్టర్ వెంటా కాంప్లెక్స్ హెచ్ఎం మల్లేష్, డిఎస్ఓ గంగా కిషన్, పాఠశాల సిబ్బంది ఉన్నారు.