Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 July 2025, 9:09 am Posted by : ramakrishna

స్కూల్ వ్యాన్ ను ఢీకొన్న రైలు : ముగ్గురి మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం

కడలూరు వద్ద ఎగిరి పట్టాలపై పడిన వ్యాన్

వెబ్ న్యూస్, బతుకమ్మ : తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కడలూరు వద్ద స్కూల్ వ్యాన్ ను రైలు ఢీకొనడంతో బస్సు ఎగిరి పట్టాలపై పడింది. ఈఘటనలో ముగ్గురు విద్యర్థులు అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. రైలు వచ్చే సమయానికి గేటు వేయకపోవడంతో ఈప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటన స్థలంలో సహాయక చర్య లు కొనసాగుతున్నాయి. కాగా,  మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.