కోటగిరిలో విషాదం

  పండగ పూట..ఆస్పత్రిలో బాలింత మృతి కోటగిరి, బతుకమ్మ : ఉగాది పండగ వేళ బాలింత మరణంతో కోటగిరి మండల కేంద్రంలో విషాద ఛాయలు  అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ..కోటగిరి మండల కేంద్రంలోని రాయకూర్ మానస (22) రాయకూర్ సురేష్ లు దంపతులు. వీరికి పదిహేను రోజుల క్రితం ఆడపిల్ల జన్మించింది.  మానస (22) కు  బీపీ ఎక్కువ  కావడంతో  శనివారం నిజామాబాద్ లోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.