Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 4:34 pm Posted by : ramakrishna

డీజీపీ కార్యాలయంలో విషాదం

 

. . . సర్వీస్ తుపాకీతో కానిస్టేబుల్ ఆత్మహత్య

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం ప్రకారం, గురువారం తెల్లవారుజామున డీజీపీ కార్యాలయంలోని వాష్‌రూమ్‌లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ లభ్యమైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటన్న దానిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. సూసైడ్ నోట్‌లోని వివరాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.