Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 July 2025, 9:23 am Posted by : ramakrishna

కీరవాణి ఇంట విషాదం.. తండ్రి కన్నుమూత

వెబ్ న్యూస్, బతుకమ్మ : ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి శివశక్తి దత్తా (92) మణికొండలోని తన నివాసంలో సోమవారం రాత్రి కన్నుమూశారు. ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కు సోదరుడు అయిన శివశక్తి పలు సినీ గీతాలను రచించారు. శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు. 1932 అక్టోబర్ 8న రాజమహేంద్రవరం సమీపంలోని కొవ్వూరులో జన్మించారు. శివశక్తి దత్తాకు ముగ్గురు సంతానం కీరవాణి, కల్యాణి మాలిక్, శివ శ్రీ కంచి.