Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 September 2025, 8:24 pm Posted by : ramakrishna

వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా కొన్ని ట్రాఫిక్ నిబంధనలు ప్రజలు పాటించి సహకరించాని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బోధన్ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాల దారి మళ్లింపు  వాహనదారులు అర్సపల్లి నుంచి రైల్వే గేట్, కలెక్టర్ ఆఫీస్, కంటేశ్వర్ బైపాస్, కంటేశ్వర్ టి జంక్షన్, రైల్వే అండర్ పాస్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్ వైపుకు వెళ్ళవలెను.  బాన్సువాడ, వర్ని వైపు నుంచి ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు వర్ని ఎక్స్ రోడ్, ఆర్ఆర్ సర్కిల్ నుంచి పూలాంగ్ మీదుగా వెళ్లగలరు.  హైదరాబాదు వైపు నుంచి వచ్చే వాహనాలు ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు మాధవ్ నగర్ నుంచి బైపాస్ మీదుగా వెళ్ళగలరు.  భారీ వినాయక విగ్రహాలు ఫ్లైఓవర్ మీదుగా దేవి రోడ్డు, సాయి రెడ్డి పెట్రోల్ బంక్, గాంధీ చౌక్ వైపు వెళుచున్నందున ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి మరియు నాందేవ్ వాడవైపు నుంచి ఫ్లైఓవర్ వైపు వాహనాలకు అనుమతి లేదు.