Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 8:57 pm Posted by : ramakrishna

పండ్ల వ్యాపారులతో ట్రాఫిక్ కు అంతరాయం

  • ట్రాఫిక్ సమస్యలను సృష్టిస్తే కఠిన చర్యలు
  • తీరు మార్చుకోవాలని హెచ్చరించిన అధికారులు

 

భీమ్ గల్, బతుకమ్మ : పట్టణంలోని బస్టాండ్ సమీపంలో పండ్ల బండ్లు, ఇతర వీధి వ్యాపారుల వల్ల  ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందని,  ఆలా వ్యవహారిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై సందీప్, మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న పండ్లు అమ్మేవారు,కూరగాయలు అమ్మేవారు, ఇతర వీధి వ్యాపారులకు ట్రాఫిక్ రూల్స్, నియమ, నిబంధనలను గురించి వారు అవగాహన కల్పించారు. తరచుగా బస్టాండ్ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నందున ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు .త్వరలో పండ్లు, కూరగాయలు అమ్మేవారిని అనువైన  స్థలంలకు మార్చడం జరుగుతుందని వారు తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకోబడతాయని వారిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానర్ ఆంజనేయులు. మేనేజర్ నరేందర్ మున్సిపల్ సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.