Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 October 2025, 6:39 pm Posted by : ramakrishna

ట్రాఫిక్ సిబ్బంది మానవత్వం

  • ఫిట్స్ వచ్చి పడిపోయిన వ్యక్తిని ఆదుకొని సహాయం
  • అభినందించిన సీపీ సాయిచైతన్య

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరానికి చెందిన కరీం బోధన్ బస్టాండ్ దగ్గరలో అరటిపండ్ల బండి పెట్టుకొని వ్యాపారం సాగిస్తున్నాడు. శుక్రవారం సడన్గా ఫిట్స్ వచ్చి అక్కడే పడిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది ఏఆర్ఎస్ఐ  కోటేశ్వర్ రావ్ వెంటనే స్పందించి అతనికి ప్రథమ చికిత్స చేసి వాళ్ల బ్రదర్ ని పిలిపించి ఇంటికి పంపించారు. అంతేకాకుండా ట్రాఫిక్ తరఫున పూర్ ఫ్యామిలీ కీ రూ 500 క్యాష్ అందజేశారు. ఈ సందర్బంగా అట్టి వ్యక్తి ని ఆదుకొని సహాయం చేసిన ట్రాఫిక్ సిబ్బంది ని నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అభినందించారు.