Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 6:21 pm Posted by : ramakrishna

సంప్రదాయ వంటకాలు భుజించాలి

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

సంప్రదాయ వంటకాలను వదిలేసి తక్షణ ఆహారం పిజ్జా, బర్గర్, ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ రైస్ తదితర ఆహార పదార్థాలు తినడం వల్ల అనేక వ్యాధులు సోకే అవకాశం ఉందని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పెద్ది సంతోష్ కుమార్ అన్నారు. మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఫుడ్ ఫెస్టివల్ (ఆహార పండగను) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

 

Traditional dishes should be eaten.

 

అమ్మ వంట ఉండగా బయట ఆహారం దండగని, సాంప్రదాయ ఆహారంలోనే ఎన్నో కార్బోహైడ్రేషన్, మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ పదార్థాలు ఉంటాయని, వండిన ఆహారమే తినాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల బృందం, విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.