Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 October 2025, 11:51 am Posted by : ramakrishna

దేవిరోడ్డులో వ్యాపారుల ధర్నా

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  వన్ వే తో తమ వ్యాపారం నష్ట పోతున్నామని దేవిరోడ్డులో వ్యాపారులు శనివారం ఆందోళన చేసి , ధర్నా నిర్వహించారు. నగరంలోని దేవీ రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ట్రాఫిక్ అధికారులతో కలిసి నగరంలో వన్ వే ప్రారంభించారు. నగరంలోని ఖలీల్ వాడి, ద్వారక్ నగర్, దేవి రోడ్డు, ప్రగతినగర్ లలో వన్ వే నిర్వహించారు. దీంతో దేవిరోడ్డులో వ్యాపారులు వన్ వే  కారణంగా తమ వ్యాపారం తీవ్రంగా నష్టపోతున్నామని ధర్నా నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు చేరుకొని వ్యాపారులతో మాట్లాడారు. వన్ వే ను తీసి తమ వ్యాపారానికి ఇబ్బందులు లేకుండా చూడాలని వ్యాపారులు కోరారు.

Traders' protest on Devi Road